![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -270 లో... రామరాజు ఇంటికి వస్తాడు. ఎక్కడ శ్రీవల్లి ఫోటోస్ గురించి చెప్తుందోనని త్వరగా భోజనం చెయ్యండి అని వేదవతి టెన్షన్ పడుతుంది. అదంతా రామరాజు చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. శ్రీవల్లిని వేదవతి పక్కకి తీసుకొని వెళ్లి ఫోటోస్ గురించి.. ఇప్పుడు అయనకి ఏం చెప్పొద్దని అంటుంది. నర్మద వచ్చి అదే విషయం శ్రీవల్లికి చెప్తుంది.
ఆ తర్వాత శ్రీవల్లి లోపలికి వెళ్లి ఫోటోస్ కొరియర్ లో పెట్టుకొని బయటనుండి ఎవరో తీసుకొని వచ్చినట్లు తీసుకొని వచ్చి మావయ్య మీరు కొరియర్ అని ఇవ్వబోతుంటే నర్మద కొరియర్ లాక్కొబోతుంటే ఫోటోస్ కిందపడిపోతాయ్. అవి చూసి రామరాజు షాక్ అవుతాడు. శ్రీవల్లి లోపలికి వెళ్లి భాగ్యంకి ఫోన్ చేసి ప్రేమ గురించి ఇంట్లో తెలిసేలా చేసానని అంటుంది. ఆ తర్వాత ఫోటో లో ఉన్న అతన్ని చూసారా మావయ్య.. మొన్న ప్రేమ తన వెంట కర్ర పట్టుకొని వెంబడిస్తుంటే పేపర్ లో వచ్చిందని చెప్తుంది.ఏమై ఉంటుంది ప్రేమ, దోమ అనుకుంటా అని శ్రీవల్లి అనగానే శ్రీవల్లిపై రామరాజు కోప్పడతాడు.
తెలుసుకోకుండా అలా మాట్లాడతారా అని రామరాజు అంటాడు. అప్పుడే రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. నేను నీ చిన్న కోడలు ప్రేమించుకున్నామని చెప్తాడు అప్పుడే వెనకాల నుండి ధీరజ్ వచ్చి కళ్యాణ్ తలపై కొడుతాడు. ఏంటి ఫోన్ కట్ అయిందని రామరాజు మళ్ళీ ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |